తెలంగాణాలో వారం రోజుల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (17:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదులు గాలుల ప్రభావం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది.
 
శుక్రవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టులు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు