తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు: టీటీడీకే ఫస్ట్ ప్రైజ్!

సోమవారం, 26 జనవరి 2015 (13:06 IST)
తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. 
 
దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థాన శకటంతో ప్రారంభమైన ప్రదర్శన విశేషంగా జరిగింది. 
 
వ్యవసాయ, నీటిపారుద, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పౌరసరఫరాలు, జాతీయ ఆహార భద్రత సహా పలు శకటాలు అలరించాయి. శకటాల ప్రదర్శన అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి బహుమతి అందుకుంది.

వెబ్దునియా పై చదవండి