తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా లింగంపెట్ మండలం భవానిపెట్ గ్రామంలో పెద్దపులి పిల్ల గ్రామస్థుల కంట పడింది. ఊరి చివర కొండ గుహల్లో పులి పిల్లను చూసిన గ్రామస్థులు దానిని చేరదీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి పిల్లను హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. పులులు అంతరించి పోతున్న సందర్భంలో పులిపిల్ల దొరకడం మంచి పరిణామని అధికారులు అంటున్నారు.