అది చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ..

మంగళవారం, 3 మార్చి 2015 (17:55 IST)
రాష్ట్ర రాజధాని పేరుతో ఏర్పాటైన సిఆర్ డిఏ కాపిటల్ ఆఫ్ రీజినల్ డెవలప్ మెంటు అథారిటీ కాదు. అది పూర్తిగా చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవెలప్ మెంట్ అథారిటీ అని కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఎద్దేవా చేశారు. . కావలసింది వందల ఎకరాల భూమి అయితే లక్షల ఎకరాలు సేకరించి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
నెల్లూరులో ఆక్ష్న విలేకరులతో మాట్లాడుతూ, రాజధానికి కావాలసిన భూమి 500 ఎకరాలు అవసరమైతే.. చంద్రబాబు మాత్రం వేల ఎకరాలు రైతుల నుంచి సేకరిస్తున్నారని అన్నారు. బ్రహ్మాండమైన సిటీ నిర్మిస్తామని మాయ మాటలు చెపుతున్నారని ఆరోపించారు. అయితే భూ సేకరణ తరువాత ఆ భూమి మొత్తాన్ని సింగపూర్ కంపెనీలకు అమ్మేసి తన రియల్ ఎస్టేట్ కంపెనీని అభివృద్ధి పరుచుకుంటారని ఆయన మండిపడ్డారు. 
 
చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పెద్ద ఆఫర్ ఇస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వలలో చిక్కుకోరాదని సలహా ఇచ్చారు. చంద్రబాబు చరిత్ర మోసపూరితమైనదనీ, జయప్రదను కూడా రాజకీయంగా వినియోగించుకుని తరువాత వెలివేశారని ఆరోపించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి