అందుకే నేను బయటకు రావడంలేదు: మీడియా ముందుకు రమణదీక్షితులు

మంగళవారం, 13 అక్టోబరు 2020 (16:05 IST)
చాలారోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ నుంచి నవరాత్రి అలంకార బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
అధిక మాసం సందర్భంగా ఈ యేడాది  రెండు బ్రహ్మోత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. ధ్వజరోహణం, ధ్వజ అవరోహణం వైదిక కార్యక్రమాలు మిగిలిన అన్ని కార్యక్రమాలు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. మహారథం బదులుగా స్వర్ణరథోత్సవం ఉంటుంది. విశేషమైన ఆరాధనలు, లోక క్షేమం కోసం జరిగే హోమాలు, రెట్టింపు దిట్టంతో జరిగే నైవేద్యాలు, విశేష తీరు, ఆభరణాల అలంకరణలు కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉంటాయని చెప్పారు.
 
కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తుల క్షేమార్థం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. మాఢ వీధుల్లో జరిగినా, ఏకాంతంగా జరిగినా స్వామివారి వైభోగమే వైభోగమే. స్వామివారు భూలోకానికి విచ్చేసిన ముహూర్తానికి పండుగగా నిర్వహించే ఉత్సవమే బ్రహ్మోత్సవం. 
 
స్వామివారి సంకల్పంతో ఏకాంతంగా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. నా వయస్సు రీత్యా ఎక్కువ బయట తిరగరాదని వైద్యులు సూచించారు. అందుకే ఎక్కువగా బయటకు రావడం లేదు. మరొక కారణాలు లేవని చెప్పుకొచ్చారు రమణదీక్షితులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు