ఆంధ్రప్రదేశ్‌ లో కోవిడ్‌ వ్యయం రూ.1,458.27 కోట్లు అట

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:08 IST)
ప్రపంచాన్నే కుదిపేసి ఆర్థికంగా తీవ్ర నష్టాలను మిగిల్చిన కరోనా.. భారతదేశంలోనూ వేల కోట్ల రూపాయలను స్వాహా చేసింది. భారతదేశంలో 5.30 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా దెబ్బకు ఇప్పటివరకు రూ.1,458.27 కోట్లు వ్యయం అయినట్టు తాజా లెక్కల్లో తేలింది.
 
రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం 14 వీఆర్‌డీఎల్‌ ల్యాబరేటరీలను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు, వాటికి కావాల్సిన రసాయనాలు, కిట్‌లు, సిబ్బంది కోసం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ఆధ్వర్యంలో రూ.95.64 కోట్లు వ్యయం చేశారు.
 
పీపీఈ కిట్‌లు, ఎన్‌ 95 మాస్కులు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌లు, ట్రూనాట్‌ మెషీన్లకు వాడిన చిప్స్‌, నెగిటివ్‌ ప్రెషర్‌ రూమ్స్‌, సర్జికల్‌ ఐటెమ్స్‌, మందులకు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివఅద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో రూ.783 కోట్లు వెచ్చించారు.

కోవిడ్‌ నియంత్రణలో భాగంగా ఆయుష్‌ విభాగం చేపట్టిన కార్యక్రమాలకు, మందులకు రూ.2 కోట్లు వ్యయం ఖర్చయింది.
టెస్టింగ్‌లు, ట్రేసింగ్‌, రవాణా, క్వారంటైన్‌ కేంద్రాలు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలకు, పరిపాలన వ్యయం కలిపి కలెక్టర్ల ఆధ్వర్యంలో రూ.559.07 కోట్లు ఖర్చు చేశారు.
 
సిబ్బందికి ఓయో రూమ్‌లు, టూరిజం రూమ్‌లు, కోవిడ్‌ సిబ్బంది వేతనాలు, ఐటీ వ్యవహారాలు, కోవిడ్‌ ఆస్పత్రులకు సీసీ కెమెరాలు, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులు తదితరాలకు రూ.18.56 కోట్లు వెచ్చించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు