అన్న క్యాంటీన్లు ఉంటే పేదలకు ఈ దుస్థితి వచ్చేది కాదు: కేశినేని నాని

మంగళవారం, 24 మార్చి 2020 (20:50 IST)
కరోనా నేపథ్యంలో సకలం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విజయవాడలోనూ లాక్ డౌన్ నడుస్తోంది. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఓ వాహనంలో ఆహార ప్యాకెట్లను తీసుకువచ్చి రోడ్డుపై ఉన్నవారికి పంచుతున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. ఇవాళ అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే పేదలకు ఈ దుస్థితి వచ్చుండేది కాదని అభిప్రాయపడ్డారు.

ముందు వెనుక ఆలోచించకుండా అన్న క్యాంటీన్లు మూసివేశారని, లేకుంటే పేదల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నాణ్యమైన భోజనం లభించేదని అభిప్రాయపడ్డారు.

పాలకులు ఓ పని చేసే ముందు దాని వల్ల వచ్చే పరిణామాలను వందసార్లు భేరీజు వేసుకోవాలని నాని హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు