అయితే, ఇలా పంపిన ఉద్యోగిని ఎప్పుడు పునర్నియమిస్తారనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టతలేదు. వారాల నుంచి కొన్ని నెలల వరకు కూడా వీఆర్‌లో కొనసాగుతున్న వారున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వీరికి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది.
ఎస్పీ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు వీఆర్‌కు ఆదేశించినవారిని ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయం లేదా జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తుంది. వీఆర్‌లో వెయిటింగ్‌లో ఉన్నవారికి జీతం రాదు, అయినా ఎస్పీ, డీఐజీ, డీజీపీ కార్యాలయానికి రోజూ వచ్చి వెళ్లాల్సిందే. దీంతో వీఆర్ అంటే భారీ శిక్షగా భవిస్తారు.
రాష్ట్రంలో 5నెలల క్రితం ప్రభుత్వం మారడంతో వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపారు. క్షేత్రస్థాయి పోలీసుల నుంచి, సబ్ డివిజనల్ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారి కోయ ప్రవీణ్, డీఐజీ ర్యాంకులో ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్, డీజీపీ ర్యాంకు అధికారి ఏబీ వేంకటేశ్వరరావు వరకూ పలువురు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.