కరోనా కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం పెరుగుతోంది. ఆన్లైన్ టిక్కెట్లతో పాటు సర్వదర్సనం టిక్కెట్లు ఇస్తుండటంతో భక్తులు టోకెన్లను పొంది తిరుమలకు చేరుకుంటున్నారు. గతంలో తిరుమల భక్తజన సంద్రంగా ఏవిధంగా ఉండేదో.. అదేవిధంగా ప్రస్తుతం కూడా మారుతోందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
శ్రీవారి లడ్డూలను 50.4 లక్షల వరకు భక్తులకు విక్రయించారు. అన్నప్రసాదాన్ని 8 లక్షల 99 వేల మంది స్వీకరించారు. 2 కోట్ల 92 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. ఒకే ఒక్క నెలలో ఈ స్థాయిలో రాబడి, భక్తులు స్వామివారిని దర్సించుకోవడంతో టిటిడి అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో వెల్లడించారు.