అయితే ఇపుడు వైకుంఠం క్యూకాంప్లెక్సులో దర్శన టికెట్ల స్కానింగ్, తిరుపతిలోని ఎస్‌ఎస్‌డీ కౌంటర్లు, అలిపిరి టోల్‌గేట్ వద్దనున్న కౌంటర్లను కేవీఎం ఇన్‌ఫో(బెంగళూరు) అనే మెన్‌పవర్ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో అదనపు ఈవో ధర్మారెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో సేవలను ప్రారంభించారు.
తిరుపతి, తిరుమలలోని 164 కౌంటర్లను మూడు షిఫ్టులలో నడిపేందుకు 430 మంది సిబ్బంది అవసరమన్నారు. ఈ సిబ్బందికి వారంపాటు శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో ప్రతి వారం సిబ్బందిని మార్చనున్నట్టు వివరించారు. కౌంటర్ల నిర్వహణ కోసం బ్యాంకులు స్వచ్ఛందంగా ముందుకొస్తే అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.