రేపు 'వైఎస్‌ఆర్‌ ఆసరా' .. వరసగా రెండో ఏడాది

బుధవారం, 6 అక్టోబరు 2021 (08:49 IST)
వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.76 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా, వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ నాలుగు వాయిదాల్లో అదే అక్కచెల్లెమ్మలకు రూ. 25,517 కోట్లు జమ. రెండో విడతగా రూ. 6,439.52 కోట్లు ఆర్ధిక సాయాన్ని అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి పది రోజుల పాటు జమ చేయడం జరుగుతుంది. 
 
అక్టోబర్‌ 7 నుంచి 17 వరకు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్‌ఆర్‌ ఆసరా ఉత్సవాలు, చెక్కుల పంపిణీ. ఈ రెండో ఏడాదితో కలిపి వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 12,758 కోట్లు
 
వైఎస్‌ఆర్‌ ఆసరా నేపధ్యం
గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని హమీ ఇచ్చి, రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసిన పరిస్ధితులలో, రుణాలు కట్టలేక, చివరికి వడ్డీ కూడా చెల్లించలేక దయనీయమైన పరిస్ధితులకు మారాం. దీనివల్ల స్వయం సహాయక సంఘాలన్నీ చిన్నాభిన్నం అయి, ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ సీ,డీ గ్రేడ్‌లోకి పడిపోయాయి
 
మహిళల అర్ధిక ఇబ్బందులను తన సుథీర్ఘ పాదయాత్రలో కళ్ళారా చూసిన వైఎస్‌ జగన్, ఎన్నికల రోజు వరకూ అనగా 11.04.2019 నాటికి అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా సంఘం పొదుపు ఖాతా ద్వారా అందిస్తానని తెలియజేయడం జరిగింది. దీనిని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలలో కూడా చేర్చడం జరిగింది. అంతేకాకుండా 2016లో రద్దు అయిన సున్నావడ్డీ పథకాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చేస్తానని చెప్పడం జరిగింది.
 
పథకం ఉద్దేశం
ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం తీసుకురావడం జరిగింది.
 
మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడం
మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది. 
 
మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా గత ఏడాది అమూల్, హిందూస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 
 
ఈ ఏడాది అజియో – రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర – ఖేతి వంటి బహుళ జాతి సంస్ధలతో ఒప్పందాలు చేసుకుని మహిళలకు వ్యాపార మార్గాలు చూపి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో వారికి సుస్ధిరమైన ఆర్ధిక అభివృద్దికి బాటలు వేశారు సీఎం వైఎస్‌ జగన్‌.
 
వరసగా రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ ఆసరా 
కరోనా కష్టకాలంలో, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత మొత్తంను 7.97 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 78.76 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ. 6,439.52 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నవరత్నాల ద్వారా మహిళలకు నేరుగా ఇప్పటివరకు సుమారు లక్ష కోట్లు లబ్ది చేకూర్చి వారి జీవితాల్లో నిజమైన కాంతులు నింపారు సీఎం.
 
మహిళా సాధికారతకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న ఇతర పథకాలు
ఈ ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుంచి, కాయ కష్టం చేయలేని ముసలి వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగు పథకాలు అమలుచేయడంతో పాటు, మహిళాభివృద్ది ద్వారానే కుటుంబాభివృద్ది జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తిగా అమ్మ ఒడి పథకం, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, పేదింటి ఆడపిల్లలలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే మనబడి నాడు – నేడు, ఇంగ్లీష్‌ మీడియం, ఇళ్ళ పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో, అన్ని నామినేటెడ్‌ పోస్ట్‌లలో 50 శాతం మహిళలకు కేటాయించడం, వృద్దాప్య మరియు వితంతు పింఛన్లు, మహిళల రక్షణకు దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్ల వంటి ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు