11 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం.. తండ్రి నిలదీస్తే?

శనివారం, 22 జులై 2023 (16:51 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరులో దారుణం జరిగింది. 11 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు దుండుగులు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల తరువాత మళ్లీ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
దీంతో తట్టుకోలేని ఆ తండ్రి ఏమైతే అది అవుతుందని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిలదీసిన తండ్రిని బెదిరింపులకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల గిరిజన బాలిక ఒంటరిగా ఇంట్ోల వున్న సమయంలో 30 ఏళ్ల లక్ష్మయ్య, 25 ఏళ్ల నవీన్ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలిపింది. దీంతో తండ్రి కోపంతో నిందితులను నిలదీశాడు. 
 
కానీ నిందితులే అతడిపై దాడి చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో నిందితురాలి తండ్రి భయపడి బయటికి చెప్పలేదు. కానీ రెండు రోజుల తర్వాత కూడా తన కుమార్తెపై అత్యాచారం జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు