ఈ సందర్భంగా మురళి గౌడ్ మాట్లాడుతూ, కన్నడ రాష్ట్రంలో మంచి హీరోగా పేరుపొందిన, ఎన్నో అనాధ శరణాలయం వృద్ధులకు చిన్నారులకు దివ్యాంగులకు అనాధ శరణాలయాలు నడుపుతున్న ఒక మంచి మనసున్న మహోన్నతమైన రాజ్ కుమార్ గౌడ్ ని కోల్పోవడం తీరని లోటు అన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కొనియాడారు. పునీత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమాల్లో జై గౌడ ఉద్యమం బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పాల హరికృష్ణ, గౌడ్ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం బాపట్ల పట్టణ అధికార ప్రతినిధి దేవరపల్లి చెంచు బాబు, బీసీ నాయకులు ఆవుల నరేష్ , బడుగు బలహీన వర్గాల నాయకులు పీ రంజిత్ కుమార్, బడుగు నాగేశ్వరరావు సీనియర్ నాయకులు గుడిపాటి పెద్దన్న. వాసు గౌడ్ సువర్ణ శార ఫౌండేషన్ ఇంచార్జ్ బడుగు బలహీన వర్గాల నాయకులు జై గౌడ్ ఉద్యమ నాయకులు పునీత్ రాజ్ కుమార్ గౌడ్ కి ఘన నివాళులర్పించారు.