అధ్యాపకుల టార్చెర్.. టీటీసీ స్టూడెంట్ ఆత్మహత్య

శనివారం, 30 ఆగస్టు 2014 (15:58 IST)
టీటీసీ స్టూడెంట్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అధ్యాపకులు, సహచరుల టార్చెర్‌తోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్ విషయంలో సహచరులు, అధ్యాపకులు అవమానించడంతో మనస్తాపానికి గురైన టీటీసీ స్టూడెంట్ కిరోసిన్ పోసుకుని నిప్పంటుకుని మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని గుత్తికొండ టీటీసీ కళాశాలలో తిమ్మారెడ్డిపాలెంకు చెందిన సుభాషిణి శిక్షణ పొందుతోంది. ఈ ఉదయం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ సుభాషిణి ప్రాణాలు కోల్పోయింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు గల కారణాలను ఆరాతీస్తున్నారు. కళాశాల యాజమాన్యం, సిబ్బంది వేధింపులే కారణమని ఆమె సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం, సిబ్బంది వేధింపులని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి