రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లు వచ్చేశాయ్.. వైకుంఠ ఏకాదశికి..?

సోమవారం, 30 నవంబరు 2020 (13:41 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచింది. తిరుమల కొండపై డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వివిధ స్లాట్లలో టికెట్ల జారీ జారీ ఉంటుందనీ... రోజూ 19వేల టికెట్లను భక్తులకు ఇస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 
 
భక్తులంతా కరోనా రూల్స్ పాటించాలని, దర్శనాలు కూడా సేఫ్ డిస్టన్స్ పాటిస్తూ చేసుకోవాలని తెలిపారు. శ్రీవారి ఆలయంలో రోజూ శానిటేషన్ చేస్తున్నామన్న అధికారులు... ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులు, ముందుగానే తిరుమలకు వచ్చి, తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం స్వామి వారి దర్శనం చేసుకోవాలని కోరారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాలని, మధ్యవర్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడొద్దని తెలిపారు.
 
వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని నిర్ణయించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి ప్రకటించారు. డిసెంబరు 25 వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు