యువత ఉజ్వల భవిష్యత్తుకు కృషి : తుడా చైర్మెన్ చెవిరెడ్డి

మంగళవారం, 5 జనవరి 2021 (20:42 IST)
రాష్ట్ర ప్రభుత్వం యువత ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తోందని తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తుడా కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో 2021 క్యాలెండర్ను చెవిరెడ్డి ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. యువత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థి దశలోనే యువత ప్రావీణ్యం గడించలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 
 
ఈ నూతన సంవత్సరంలో యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి, విద్యార్థి విభాగం నేతలు మణి, సదాశివ, సాయి చరణ్, ప్రదీప్, రాహుల్, కిరణ్, శ్యామ్, ద్వారక బాబు, శివారెడ్డి, వంశీ రెడ్డి, చంద్ర, నరసింహులు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు