ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టేందుకు గత కొంతకాలంగా హయ్యర్ ఎడ్యుకేషన్కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో డేటాసైన్స్ కోర్సు ఏర్పాటు కోసం కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి, వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, రిజిస్ర్టార్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీతో పాటు ఐఐఐటీ, టీసీఎస్, కాగ్నజెంట్ ప్రతినిధులతో కమిటీని వేశారు.
ఆ కమిటీ సమావేశమైంది. వచ్చే ఏడాది బీఎస్సీ డేటాసైన్స్‌ను హానర్స్కోర్సుగా తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సిలబస్, క్రెడిట్ పాయింట్లపైనా చర్చించారు. గురుకుల విద్యాసంస్థల్లో డేటాసైన్స్ఆరునెలల కోర్సుగా కొనసాగిస్తున్నారు.
అలాగే బీకాంలోనూ బిజినెస్ అనలైటిక్స్కోర్సుపెట్టాలని మేనేజ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ కోర్సుపై కూడా చర్చ జరిగింది. ఇప్పటికే ఈ కోర్సు సిలబస్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండు కోర్సులను ప్రభుత్వ, అటానమస్ కాలేజీల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు.