ఉద్దానం యుద్ధం తర్వాత బ్రాంది షాపులపై పీకే సమరం...

ఆదివారం, 30 జులై 2017 (15:07 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉద్దానం యుద్ధం తర్వాత జనవాసాల మధ్య బ్రాందీషాపులను తెరవడంపై సమరం సాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఆదివారం వైజాగా‌లో జరిగిన సింపోజియంలో పాల్గొన్న సందర్భంగా పలువురు మహిళలు ఇచ్చిన ఓ ప్లకార్డును ప్రదర్శించారు. ఆ ప్లకార్డులో జనావాసాల మధ్య బ్రాంది షాపును తెరవద్దు అని రాసివుంది. దీంతో ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించిన తర్వాత బ్రాందీ షాపులపై ఆయన ఆందోళనకు దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం వైజాగ్‌లో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యామ్ మాట్లాడుతూ... నేను ప్రభుత్వాలకు కాదు... ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సాటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమన్నారు. సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమన్నారు. 
 
ఉద్దానం వంటి సమస్యల పరిష్కారంలో తాను నిపుణుడిని కాదన్నారు. అయితే మనిషిగా, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని అన్నాడు. ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? అని ప్రశ్నించాడు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదన్నారు. 
 
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని భావించి ఈ విషయంలో స్పందించానని అన్నారు. ఈ ప్రయత్నంలో తనతో కలిసి నడిచి ముందుకు వచ్చే ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేసమయంలో ఈ ప్రయత్నం ప్రజల కోసమేగానీ రాజకీయ కోసం కాదనీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి