పుణ్యక్షేత్రం వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య

శుక్రవారం, 8 డిశెంబరు 2023 (10:28 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణానిసిలో ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వారణాసి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొండా వప్రియ (50) అనే వ్యక్తి, తన భార్య లావణ్య (45), పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌ (23)లతో కలిసి కైలాశ భవన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం ఆ కుటుంబం అంతా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఘటనా స్థలంలో సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకునట్టు వారణాసి పోలీస్ కమిషనర్ అశోక్ ముథా జైన్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేకే తాము ఆత్మహత్యలకు పాల్పడినట్టు సూసైడ్ లేఖలో రాశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రిక కోసం తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు