భూసేకరణ చట్టం వల్ల రైతులకు మేలే.. రాద్ధాంతం చేయొద్దు!: వెంకయ్య

శుక్రవారం, 6 మార్చి 2015 (18:45 IST)
భూసేకరణ చట్టం వల్ల రైతులకు మేలే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజల అభ్యున్నతి కోసమే భూసేకరణ చట్టం తెస్తున్నామని, ఈ చట్టంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రతి పక్షాల రాద్ధాంతం కారణంగా రైతుల్లో వ్యతిరేక భావాలు రేగే అవకాశం ఉందని, భూసేకరణ చట్టంపై అంతా కలిసి రావాలని ఆయన సూచించారు. భూసేకరణ చట్టం కారణంగా రైతులకు సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
 
కాగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా వీరిద్దరూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజ్ భవన్‌లో జరిగిన వీరి సమావేశం అరగంటకు పైగా కొనసాగింది. శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. ఈ అంశంపై వీరిరువురూ చర్చించారు.
 

వెబ్దునియా పై చదవండి