ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ: విజయసాయిరెడ్డి

ఆదివారం, 8 మార్చి 2020 (14:27 IST)
రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు
బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ భరోసా ఇచ్చారు
59.85% అణగారిన వర్గాలకు బి-ఫారాలు ఇస్తారు
బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమే కదా
 
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. సీఎం జగన్ గారు పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
 
59.85% అణగారిన వర్గాలకు బి-ఫారాలు ఇస్తారు. ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ. బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా' అని ట్వీట్ చేశారు.'రాష్ట్రంలోని 1.62 కోట్ల కుటుంబాలకు సంక్షేమ సాయం అందింది. 
 
ఏటా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా సీఎం జగన్ గారు వెనకడుగు వేయలేదు. నీ జమానాలో ప్రజలను ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేశావా? సంతృప్త స్థాయిలో ఏ పథకమైనా అమలు చేశావా? ఎలక్షన్లకు ముందు ప్రలోభ పెట్టడం తప్ప' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు