బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్.. ట్రయల్ రన్ ప్రారంభం.. ఇక ట్రాఫిక్‌కు స్వస్తి

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:42 IST)
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ వంతెనపై సోమవారం నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించనున్నారు. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను ఎలాంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అంశాల పరిశీలన కోసం వంతెనపై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు.  
 
అలాగే కలెక్టర్‌ ఇంతియాజ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు సోమవారం మరోసారి వంతెనను పరిశీలించి వాహనాలకు పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి చేతులు మీదుగా వంతెనను ప్రారంభిస్తారని సమాచారం. ప్రధానంగా ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 
 
తొలుత ఈ వంతెనను కేవలం నిర్మలా కాన్వెంట్ వరకే నిర్మించాలనుకున్నారు. కానీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రమేష్ ఆస్పత్రి కూడలి వరకు పొడిగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు