భారీ కొండ చిలువను చంపిన గ్రామస్తులు

మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:00 IST)
భారీ కొండ చిలువ ఒకటి గ్రామంలోకి చొరబడింది. దీంతో జనం భీతిల్లి పోయారు.. అక్కడ ఇక్కడా తిరగడంతో ప్రమాదం పొంచి ఉందని భావించి దానిని చంపేశారు. దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న దానిని కొట్టారు. వివరాలిలా ఉన్నాయి. 
 
శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామస్థులు మంగళవారం ఉదయం భారీ కొండచిలువను హతమార్చారు. వంశధార కుడి ప్రధాన కాలువ ద్వారా కొండ చిలువ గ్రామంలోకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. కొండచిలువ పొడవు సుమారు 10 అడుగుల వరకు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి