విశాఖలో ఏపీ మంత్రి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి - ఫ్యామిలీ ఆందోళన

బుధవారం, 10 నవంబరు 2021 (14:51 IST)
విశాఖలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి వస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు. 
 
వెనుకనే వస్తున్న మరో వాహనం అతనిపైనుంచి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టమైంది. మృతిచెందిన వ్యక్తి విజయనగరం జిల్లా గణపతినగరంకు చెందిన సూర్యనారాయణగా పోలీసులు గుర్తించారు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
మంత్రి వాహనం ఢీకొట్టడంతోనే మృతి చెందాడంటూ.. అవంతి శ్రీనివాస్‌ ఇంటిముందు మృతుని బంధువులు ఆందోళన చేశారు. మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరారు. సూర్యనారాయణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు