దీనిపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించి విచారణ చేయించారు. రికార్డులను ఉద్దేశపూర్వకంగా ఎర్ర ఇంకుతో దిద్దేసినట్లు తేలడంతో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్‌ప్రసాద్, వీఆర్‌ఏ బి.అప్పారావులను గత నెల 4నే సస్పెండ్ చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి రూ.100 కోట్ల భూస్కామ్‌కు పాల్పడినందుకు తహసీల్దార్ శంకరరావును సీసీఎల్‌ఏ సస్పెండ్ చేసింది. ఉత్తర్వులను గురువారం అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు.