అవసరమనుకుంటే ర్యాగింగ్‌ చట్టంలో మార్పులు చేస్తాం.. గంటా శ్రీనివాసరావు

సోమవారం, 3 ఆగస్టు 2015 (13:32 IST)
విశ్వవిద్యాలయాలలో ర్యాగింగ్‌ను ‌అరికట్టడానికి, నిరోధానికి చట్టాల్లోనే మార్పులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో ర్యాగింగ్‌పై జరిగిన సదస్సులో మాట్లాడారు. 
 
నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. దోషులు ఎలాంటి వారైనా, ఎంతటి వారినైనా విడిచి పెట్టమని చెప్పారు. ర్యాగింగ్‌ను అరికట్టడానికి వర్శిటీలు పూర్తి స్థాయిలో పని చేయాలని అందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. 
 
ప్రభుత్వం వైపు నుంచి కూడా అవసరమైతే చట్టాల్లోనే మార్పులు తీసుకువస్తామని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి