విభజన తర్వాత తొలిసారిగా ఏపీకి రాహుల్... 10 లక్షల నగదు... పదివేల చీరలు

శనివారం, 18 అక్టోబరు 2014 (18:38 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఆదివారం నాడు విశాఖపట్టణానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా ఆయన ఇక్కడకు రాబోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో సైతం మొహం చాటేసిన యువనేత, హుదూద్ బీభత్సం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు.
 
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... విశాఖపట్టణంలో బాధితులకు తెలంగాణ పీసీసీ ఇచ్చే రూ. 10 లక్షలతోపాటు పదివేల చీరలను అందజేస్తారట. మరి ఏపీ పీసీసి చీఫ్ రఘువీరా రెడ్డి ఏమిస్తారన్నది సస్పెన్స్ సాగుతుండగా మొత్తానికి రాహుల్ గాంధీ ఏపీలో ఇలా అడుగుపెట్టబోతున్నారు.

వెబ్దునియా పై చదవండి