మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...

గురువారం, 27 డిశెంబరు 2018 (19:18 IST)
అది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. కమలాకర్, భానుమతిలు భార్యాభర్తలు. కమలాకర్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. భానుమతి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. కమలాకర్ ఉదయం వెళితే రాత్రికి ఇంటికి వచ్చేవాడు. పని ఒత్తిడి ఎక్కువ. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోగానే ఒంటరి జీవితాన్ని ఇబ్బందిగా భావించింది భానుమతి.  
 
భర్తకు తాను ఉద్యోగం చేస్తానని చెప్పింది. అయితే అందుకు ఒప్పుకోలేదు కమలాకర్. ఇదే విషయంపై రెండు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అది చివరకు ఇద్దరూ విడిపోయేలా చేసింది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తన భార్య పుట్టింటికి వెళ్ళి మనసు మార్చుకుని తిరిగి వస్తుందని భావించాడు కమలాకర్. అయితే భానుమతి మాత్రం ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా చేరి తన భర్త ఉన్న ఇంటికి ఎదురు సందులోనే మరో ఇంటిని అద్దెకు తీసుకుంది.
 
భానుమతి ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన నాగేందర్ అనే యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. భర్త లేకపోవడంతో భానుమతి కూడా అతనితో సంబంధం పెట్టుకుంది. నెలరోజుల పాటు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. ఇదంతా భర్త కమలాకర్‌కు తెలిసింది. అయినా సరే భార్యను ఏమీ అనకుండా వదిలేశాడు. ఒకరోజు ఉన్నట్లుండి భానుమతి తీవ్ర రక్తస్రావంతో ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫోన్ చేశాడు.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భానుమతిని ఆసుపత్రిలో చేర్పించారు. తన భార్య అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న కమలాకర్ విలవిలలాడిపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి అసలు విషయం తెలసుకున్నాడు. పెళ్ళి చేసుకోమని నాగేందర్‌ను కోరానని, అయితే అతను కత్తితో తనపై దాడి చేసి పారిపోయాడని పోలీసులకు తెలిపింది. మూడురోజుల పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగాడు నాగేందర్. అయితే పోలీసులకు దొరికితే విచారణ పేరుతో ఇబ్బందులు పెడతారని భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పోలీసులు కమలాకర్, భానుమతిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన భార్య తన నుంచి వెళ్లిపోయినా కమలాకర్ మాత్రం ఆమెపైన ప్రేమను పెంచుకున్నాడు. సర్వస్వం తానేనంటూ ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు ఆ మహానుభావుడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు