పొదిలి : ఊరు వెళ్లడం కోసం ఆమె ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండులో వెయిట్ చేస్తోంది. ఆ యువకుడు వచ్చి పక్కన కూర్చున్నాడు... పదేపదే తదేకంగా చూస్తున్నాడు. వింత సైగలు చేస్తున్నాడు. పక్క బెంచ్‌లో కూర్చుని కాళ్లు తగిలిస్తూ, వెకిలి చేష్టలు చేస్తున్నాడు. దీంతో ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. కాలి చెప్పు తీసి ఆ దొంగ రాస్కెల్‌ను ఫటాఫటా వాయించింది. అంతే నలుగురూ తలో చేయి వేశారు. మొత్తానికి బస్టాండ్ లోనే కుమ్మేశారు. చివరికి పోలీసులకు అప్పగించారు.
ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండులో చోటు చేసుకుంది. పని ఉండి పొదిలి వచ్చిన ఆ మహిళ సొంతూరుకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. అక్కడ బస్సు లేటు కావడంతో ఓ బెంచ్ పైన కూర్చుంది. పక్కనే మరో బెంచీపై కొందరు మగాళ్లు కూర్చున్నారు. అందులో వయసులో పెద్దవాడైన ఓ వ్యక్తి సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఓపిక నశించిన ఆ మహిళ అందరూ చూస్తుండగానే చెప్పుతో అతగాడిని ఉతికిపారేసింది.