తన భర్త అమ్మాయితో పొద్దస్తమానం ఫోన్‌లో మాట్లాడుతున్నాడనీ.. భార్య ఆత్మహత్య

సోమవారం, 1 ఆగస్టు 2016 (09:56 IST)
భర్త ప్రవర్తనను సందేహించిన ఓ భార్య.. ఆత్మహత్య చేసుకుంది. మరో అమ్మాయితో పొద్దస్తమానం ఫోన్‌లో మాట్లాడుతుండటంతో భర్తపై సందేహం వచ్చింది. దీంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
స్థానిక ఈస్ట్‌ తాంబరం తిలకవతి నగర్‌లో ఈ ఘటన జరిగింది. తిలకవతి నగర్‌లో భాస్కర్‌ (35), సంధ్య (32) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. భాస్కర్‌ తరచూ సెల్‌ఫోన్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతుండటంతో సంధ్యకు అతడి శీలంపై అనుమానం కలిగింది. 
 
ఈ విషయమై తరచూ భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. శనివారం రాత్రి కూడా ఇదే విషయమై ఇరువురూ పోట్లాడుకున్నారు. ఆదివారం ఉదయం భాస్కర్‌ నిద్రలేచి చూడగా.. భార్య ఉరేసుకుని వేలాడుతుండటం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి