నల్లధనంపై పోరుకు జీ 20 దేశాలు అంగీకరించాయ్: మోడీ

శుక్రవారం, 21 నవంబరు 2014 (15:09 IST)
నల్లధనంపై పోరుకు జీ20 దేశాలు అంగీకరించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ శాంతి, సుహృద్భావ వాతావరణాన్ని నల్లధనం బలహీనపరుస్తుందన్న అభిప్రాయంతో అన్ని దేశాలు ఏకీభవించాయని పేర్కొన్నారు. ప్రపంచం యావత్తు గొప్ప గౌరవ భావంతో భారత్ వైపు చూస్తోందని మోడీ తెలిపారు. 
 
మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ పర్యటన ముగించుకుని వచ్చిన మోడీ ఈ మేరకు ట్వీట్ చేశారు. తాజా విదేశీ పర్యటనలో 38 మంది ప్రపంచ నాయకులతో భేటీ అయినట్టు తెలిపారు. 20 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నానని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి