కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసు దర్యాప్తు జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదుచేశారు. ఈ కేసు దర్యాప్తును అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె కోరుతూ... ప్రతివాదులుగా సీబీఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ డీజీపీలను చేర్చారు.
ఏ1గా ఎర్రగంగిరెడ్డి, ఏ2గా సునీల్‌యాదవ్, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ4గా దస్తగిరి, ఏ5గా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ నమోదు చేసింది. వీరిలో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం కడప జైల్లో రిమాండు ఖైదులుగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి బెయిల్‌పై ఉన్నారు. అయిదు నెలలుగా సీబీఐ విచారణలో వేగం మందగించింది. ఎవరినీ విచారణ చేయడం లేదు. ఈ క్రమంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రత్యేకతను సంతరించుకుంది.