ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడతారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు.