\సమైఖ్య రాష్ట్రంలోని చేవెల్ల నుండి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజశేఖర రెడ్డి దగ్గరయ్యారని గవర్నర్ ప్రస్తుతించారు. 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగాన్ని మెరుగు పరచడంతో పాటు, పేద, అణగారిన ప్రజల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల ప్రియమైన నాయకుడుగా చరిత్రలో నిలిచారని, మానవత్వంతో ప్రజల శ్రేయస్సు పట్ల చూపిన శ్రద్ధకు ఆయన ఎప్పుడూ వారి మనస్సులలో చిరస్థాయిగా గుర్తుండి పోతారన్నారు. నేల తల్లిని నమ్మిన భూమి పుత్రునిగా వైఎస్సార్ కు నివాళి అర్పిస్తూ అయన జన్మ దినోత్సవాన్ని రైతు దినోత్సవం గా పాటించడం సముచితమన్నారు.