కారు మాజీ డ్రైవర్ హత్య కేసు : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

సోమవారం, 23 మే 2022 (11:46 IST)
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబును కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో ఆయనను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనంతబాబుతో పాటు ఆయన అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
కాగా, ఈ హత్య కేసులో మరికొందరికి సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పైగా, సుబ్రహ్మణ్యంను కొట్టి చంపినట్టు ప్రాథమిక విచారణలో అనంతబాబు, ఆయన అనుచరులు అంగీకరించినట్టు సమాచారం. అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఐజీ పాలరాజు వెల్లడించే అవకాశం ఉంది. 
 
కాగా, అధికార పార్టీకి చెందిన అనంతబాబు తన అధికారాన్ని, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అన్యాయాలు, రహస్యాలు అన్నీఇన్నీకావు. అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అనంతబాబు గుట్టు మొత్తం తెలిసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎపుడైనా బయటపెడతాడన్న భయంతోనే తన మాజీ కారు డ్రైవర్‌ను కొట్టి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు