గతంలో కనివిని ఎరుగని విధంగా నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని కొనియాడారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన దానికంటే కూడా జగన్ ఇంకా ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. పాలనలో అవినీతికి తావులేకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి నిక్కచ్చి మనిషి అని, మంత్రిగానూ పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆయన మరిన్ని సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.