సీమాంధ్రలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తాం : మంత్రి యనమల

సోమవారం, 17 ఆగస్టు 2015 (17:03 IST)
సీమాంధ్ర రాజధాని ప్రాంతంలో ఉపాధి అవకాశాల రూపకల్పనలో నిరుద్యోగ యువత అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ విధానాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకోసం 371డి ఆర్టికల్ సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కొత్త రాజధానిలో అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వచ్చేలా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. 
 
ఉమ్మడి రాష్ట్రానికే జోనల్ వ్యవస్థ వర్తిస్తుందన్నారు. రాష్ట్రం విడిపోయింది గనుక దానిపై మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారికి కొన్ని వెసులుబాటులు కల్పించాల్సిన అవసరం ఉందన్న మంత్రి, అవసరమైతే అందుకోసం జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి