లోక్‌సభ ఎన్నికల్లో 332 పార్టీలు ఔట్...!

దేశవ్యాప్తంగా జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 369 పార్టీలు పోటీపడ్డాయి. వీటిలో 332 పార్టీలు అసలు ఖాతాకూడా తెరవలేక పోయాయి.

దేశంలో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికలలో అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో బాటు చిన్నా-చితకా పార్టీలుకూడా రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 369 పార్టీలు పోటీ పడగా వీటిలో 332 పార్టీలు తమ ఖాతాను తెరవలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఇదిలావుండగా 7 జాతీయ పార్టీలతో సహా మొత్తం 37 పార్టీలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం లభించింది. కాగా లోక్ జనశక్తి పార్టీ, పట్టలి మక్కల్ కచ్చితోసహా గత లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది పార్టీలు ఈ సారి కనీసం ఒక్క సీటునుకూడా కైవసం చేసుకోలేదని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి