2,727 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు

ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 2,727 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కనీసం ఆరో శాతం ఓట్లను ఈ అభ్యర్థులు సంపాదించుకోలేక పోయారు. దీంతో వారు చెల్లించిన డిపాజిట్ సొమ్మును కోల్పోయారు. దీనివల్ల కేంద్ర ఎన్నికల సంఘానికి 1.3 కోట్ల రూపాయలు వచ్చింది.

ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభ్యర్థులు వరుసగా 294, 224 స్థానాలలో పోటీ చేశారు. అయితే, ఈ పార్టీల తరపున బరిలోకి దిగిన ప్రతి అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించి డిపాజిట్‌ను దక్కించుకున్నారు.

ఇకపోతే, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు 45 చోట్ల పోటీ చేయగా, మూడు చోట్ల డిపాజిట్‌ను కోల్పోయారు. అలాగే, మరో కొత్త పార్టీ ప్రజారాజ్యం 289 స్థానాల్లో పోటీ చేసి 42 చోట్ల డిపాజిట్‌ను దక్కించుకోలేక పోయింది.

జాతీయ రాజకీయ పార్టీ అయిన భాజపా అభ్యర్థులు 271 స్థానాల్లో పోటీ చేసి 239 చోట్ల డిపాజిట్ గల్లంతైంది. బీఎస్పీ తరపున 265 (268), 18 చోట్ల పోటీ చేసిన సీపీఎం నాలుగు చోట్ల, 14 చోట్ల పోటీ చేసిన సీపీఐ ఒక చోట డిపాజిట్‌ను కోల్పోయారు.

ఇకపోతే 1.75 శాతం ఓట్లు సాధించిన లోక్‌సత్తా మొత్తం 246 స్థానాల్లో పోటీ చేయగా 230 చోట్ల డిపాజిట్‌లు గల్లంతయ్యాయి. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేసిన 188 చోట్లలో డిపాజిట్‌ను కోల్పోయింది.

వెబ్దునియా పై చదవండి