నేడు ప్రధానిగా మన్మోహన్ ప్రమాణం

FileFILE
దేశ ప్రధానమంత్రిగా మన్మోహన్‌సింగ్‌ వరుసగా రెండోసారి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరుగనుంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మన్మోహన్‌తో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ పదవి ప్రమాణం చేయిస్తారు. ప్రధానితో పాటు మరికొంతమంది ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 33 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఆరు లేదా ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో మంత్రిపదవులు దక్కని వారికి రాష్ట్రంలో ఇతర నామినేటెడ్ పోస్టులను కేటాయించే అవకాశం ఉంది. 15వ లోక్‌సభ స్పీకర్ పదవి కూడా మనరాష్ట్రానికే దక్కే అవకాశం ఉంది.

అరకు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపికైన గిరిజన దొర కిషోర్‌ చంద్రదేవ్‌ స్పీకర్‌ పదవి రేసు ముందున్నారు. అలాగే, గత మంత్రి వర్గంలో మంత్రులుగా ఉన్న జైపాల్‌రెడ్డి, పురంధేశ్వరి, పళ్ళం రాజులకు మరోసారి అవకాశం దక్కనుంది.

ఎస్సీ కోటాలో పనబాక లక్ష్మీ, చింతామోహన్‌లలో ఒకరికి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌లో ఒకరికి, తెలంగాణ నుంచి మధుయాష్కీ, వి.హనుమంతరావు, కేశవరావులో ఒకరికి, సీఎం కోటా నుంచి ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సాయిప్రతాప్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది.

వెబ్దునియా పై చదవండి