మంత్రివర్గ విస్తరణపై సోనియా, మన్మోహన్ దృష్టి

యూపీఏ ఏడుగురు మంత్రుల ప్రతిపాదనకు డీఎంకే చీఫ్ కరుణానిధి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యూపీఏలో తలెత్తిన సంక్షోభం ముగిసింది. మూడు క్యాబినెట్, నాలుగు సహాయమంత్రి పదవులను తీసుకునేందుకు కరుణానిధి అంగీకరించడంతో మన్మోహన్, సోనియా తదుపరి కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు.

మంగళవారం రెండో దశ విస్తరణ కార్యక్రమం ఉండవచ్చని సంబంధిత వర్గాల సమాచారం. యూపీఏలో కీలక భాగస్వామి అయిన డీఎంకే పార్టీ ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, నలుగురు సహాయమంత్రుల పదవులను తీసుకునేందుకు అంగీకరించింది. నలుగురు సహాయమంత్రులలో ఒకరికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రిగా కొనసాగనున్నారు.

యూపీఏలో గతంలో నౌకాయాన మంత్రిగా పనిచేసిన టీఆర్ బాలు ఈసారి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనే అంశంపై డీఎంకే అధినేత కరుణానిధి బహిర్గత పరచలేదు.

ఎవరికి ఏ మంత్రి పదవి కట్టబెట్టాలన్న అంశంపై మన్మోహన్, సోనియాలతో కరుణానిధి చర్చిస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి