మన ప్రధాని గురించి తెలుసుకుందాం..

FileFILE
దేశ ప్రధానిగా వరుసగా రెండోసారి పదవీబాధ్యతలు చేపట్టి మన్మోహన్ సింగ్ గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ తరపున శుక్రవారం సాయంత్రం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్ వ్యక్తిగతం గురించి తెలుసుకుంటే ఎన్నో విశేషాలు గోచరిస్తాయి.

మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబర్‌ 26న పశ్చిమ పంజాబ్‌లోని గావ్‌లో జన్మించారు. (ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది). ఇక మన్మోహన్ విద్యాభాసానికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్.ఏ, డి.పిల్ సాధించారు.

అలాగే డి.లిట్ (హానరీస్ కాసా)తో పాటు పంజాబ్, కేంబ్రిడ్జ్‌లలో విద్యాభ్యాసం సాగించడం విశేషం. ఇక మన్మోహన్ వైవాహిక జీవితానికి సంబంధించి ఆయన 1958 సెప్టెంబర్ 14న పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఉపేందర్, దామన్, అమ్రిత్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మన్మోహన్ అలంకరించిన పదవుల గురించి ఓసారి పరిశీలిస్తే... 1972-76లో ఆర్థిక మంత్రిత్వశాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేశారు. అలాగే 1976-80ల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డైరెక్టర్‌గా, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారు.

ఆ తర్వాత ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ మనీలాకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌గా, ఐబీఆర్‌డీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌గా పనిచేశారు. దీని తర్వాత ఏప్రిల్ 1980-సెప్టెంబర్ 1982 మధ్య ఫ్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా చేశారు. అలాగే సెప్టెంబర్ 1982- 1985 మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా చేశారు.

దీని తర్వాత ఆగస్ట్ 1987- నవంబర్ 1990 మధ్య కాలంలో జెనీవాలోని సౌత్ కమిషన్‌లో సెక్రటరీ జనరల్, కమిషనర్‌గా చేశారు. అలాగే డిసెంబర్ 1990- మార్చి 1991 మధ్య కాలంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి భారత ప్రధానికి సలహాదారుగా పనిచేశారు. ఇక 1991 అక్టోబర్‌లో ఆయన రాజ్యసభకు ఎన్నుకయ్యారు.

అటుపై మరోసారి 2001లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. చివరకు 2004లో యూపీఏ తరపున ప్రధానిగా ఎంపికయ్యారు. ఇలా అత్యున్నత విద్యాభ్యాసంతో పాటు అత్యున్నత పదవులు అలంకరించిన మన్మోహన్ దేశ ప్రధానిగా రెండోసారి ఎంపిక కావడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి