కోనసీమ అందాల లోకంలో....

శనివారం, 10 మే 2008 (18:39 IST)
WD
కోనసీమ పృకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పచ్చని తివాచీలు పరిచినట్లుండే కోనసీమ విశిష్ట నదీ సంగమ ప్రదేశాలు, అంతర్వేది బలుసుతిప్ప మొగలు, ఓడలరేవు విశేషంగా ఆకర్షిస్తాయి. అంతర్వేది వద్ద విశిష్టానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాన్ని అన్నాచెల్లెళ్ల గట్టుగా పిలుస్తారు. ఇక్కడ నిర్మించిన లైట్ హౌస్ ప్రత్యేక ఆకర్షణ.

గోదావరి నది ఒడ్డున కూర్చుని సంధ్యాసమయాలను తిలకించటం ఓ గొప్ప అనుభూతినిస్తాయి. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్యర్యంలో నడిచే హౌస్ బోగులో గోదావరిలొ విహరిస్తూ రోజంతా కోనసీమ అందాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి అందాలతో పాటు గోదావరి గలగలలు, కోనసీమ కొబ్బరిచెట్లు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ప్యాకేజ్‌లు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజ్‌లో బోట్ షికారుతో పాటు, ముఖ్యమైన దేవాలయాల సందర్శనం ఉంటుంది.

ఇక పాపికొండల నడుమ గోదావరి అందాలను చూడడం తప్ప ఆ అనుభూతిని వర్ణించటం సాధ్యంకాదు. నేటి బిజీ లైఫ్‌లో కాస్తంత సేదతీరటానికి అనుకూలమైన ప్రదేశం... వేసవిలో చల్లదనాన్ని పంచే ప్రాంతం... కోనసీమ. ఈ సీమలోని అన్ని అందాలను దర్శించటానికి రాష్ట్రటూరిజం శాఖ అన్ని సదుపాయాలు కల్పించింది. మరింకెందుకాలస్యం... ఎలాగూ వేసవి సెలవులు... కనుక కుటుంబసభ్యులతో కలిసి ఓసారి వెళ్లి రండి.

వెబ్దునియా పై చదవండి