గిరిజనులు ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా

అదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఆరాధ్య దైవంగా గాంధారి ఖిల్లా వెలుగొందుతోంది. అంతేకాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని మందలమర్రి, బొగ్గలగుట్ట మధ్యన ఉన్న కొండల్లో ఈ ఖిల్లా వెలసివుంది. ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది. ఈ ఖిల్లాలో వున్న మైసమ్మ దేవతను ఆ ప్రాంతాల ప్రజలు, గిరిజనలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ప్రతి ఏడాది జరిగే ఉత్సవాల్లో దున్నపోతును సైతం బలిస్తారు. ఇలా గిరిజనల ఇష్టదైవంగా ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకులు సైతం ఇక్కడకు వస్తుంటారు. అయితే ఇలాంటి ప్రాంతాన్ని మాత్రం అటు పాలకులు, ఇటు ప్రభుత్వ పర్యాటక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి