07-08-2021 శనివారం దినఫలాలు - ఈశ్వరుని ఎర్రని పూలతో పూజించినా...

శనివారం, 7 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. తలపెట్టిన పనులలో అవాంతరాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. 
 
వృషభం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
మిథునం : వ్యాపారస్తులు ఒడిదుడుకలను ఎదుర్కొంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయానికి తగినట్టుగా ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో సమస్యలను ఎదుర్కొంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాలలో పురోభివృద్ధి కానవస్తుంది. హామీలు, చెక్కుల జారీ విషయంలో మెళకువ అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉంటుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
సింహం : ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. ప్రయాణాలు అనుకూలించగలవు. ఖర్చులు అదుపుకాకపోగా, మరింత ధనవ్యయం అవుతుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదని గమనించండి. 
 
కన్య : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. స్త్రీలకు పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. శతృవులపై విజయం సాధిస్తారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులను సమీక్షిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు. 
 
వృశ్చికం : అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మచిందికాదని గమనించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. 
 
మకరం : మీ కోపాన్ని, చిరాకును ఎక్కువా ప్రదర్శించడం మంచిదికాదు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. పెద్దల సలహాను పాటించడం వల్ల మీకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
కుంభం : ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి వ్యాపార వర్గాల వారి మాటతీరు స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. గృహమునకు కావాల్సిన వస్తువులను సమకూర్చుకుంటారు. 
 
మీనం : ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. మిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయం సతమతమవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు