01-02-2020 శనివారం మీ రాశి ఫలితాలు - అనంత పద్మనాభ స్వామి ఆరాధనతో...?
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (05:00 IST)
అనంత పద్మనాభ స్వామి ఆరాధనతో అంతా శుభం.
మేషం: బ్యాకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధంగా వుంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. మీ శ్రీమతిని నొప్పించకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి వుంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
వృషభం: కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం మీకు చికాకును కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రమకు తగిన ప్రోత్సాహం, ప్రతిఫలం పొందుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయండి. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం: మీ వాగ్ధాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
కర్కాటకం: పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగులు గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండు, పూల వ్యాపారులకు లాభదాయకం. రావలసిన బకాయిలు సకాలంలో అందుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు.
సింహం: ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పిగొట్ట గలుగుతారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసివస్తుంది.
కన్య: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కారిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఎదుర్కొంటారు.
తుల: ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో క్షణం తీరిక వుండదు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యమని గమనించండి.
వృశ్చికం: రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీ భవించలేకపోతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ప్రయాసలు అధికమవుతాయి. నూతన రుణాల కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి.
ధనస్సు: ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతిని దూరం చేస్తారు.
మకరం: ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది.
కుంభం: విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. పత్రికా సంస్థల్లోని వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
మీనం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కొంతమంది మీతో స్నేహంగా నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటిండం వల్ల ఆశించిన ప్రయోజం వుంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాస పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది.