06-06-2020 శనివారం మీ రాశి ఫలితాలు.. శ్రీ వేంకటేశ్వర స్వామిని?

శనివారం, 6 జూన్ 2020 (02:00 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామిని పున్నాగ పూలతో పూజించిన అర్చించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. వైద్య, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. సోదరుల నుంచి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. 
 
వృషభం: స్త్రీల పట్టుదల, మొండి వైఖరి సమస్యలకు దారి తీస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
మిథునం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగండి. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. రిప్రజెంటటేవ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తి చేస్తారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
సింహం: రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికం. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచితుల పట్ల అప్రమత్త అవసరం.
 
కన్య: ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులు అధికంగా వుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులు వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
 
తుల : మీ కుటుంబీకుల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు చోటుచేసుకుంటాయి. మీ రాక బంధుమిత్రులకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తాయి. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు పని శ్రమ, పని ఒత్తిడి, అధికం.
 
వృశ్చికం: స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. నూతన వాతావరణం, పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దూరప్రయాణాలు, తీర్థయాత్రలను విరమించుకుంటారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు.
 
ధనస్సు: నూనె, పసుపు, చింతపండు స్టాకిస్టులకు, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి.
 
మకరం: ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు బాధ్యతలు పెరగడం వల్ల పనిభారం తప్పదు. రావలసిన ధనం వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు.
 
కుంభం: మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వాహన చోదకులకు చికాకులు అధికమవుతాయి. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మీ అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెలకువ అవసరం.
 
మీనం: ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రియమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. రుణాల తీరుస్తారు. నూతన దంపతులు పరస్పరం మరింత చేరువవుతారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు