11-06-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించినా...

శుక్రవారం, 11 జూన్ 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యసాధనలో పట్టుదలతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. 
 
వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నరాలకు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. 
 
మిథునం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం, ఆదాయం స్వల్పం. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. నూతన రుణాలు కోషం అన్వేషిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
సింహం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దేవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 
 
కన్య : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. అధికారులు ధన ప్రలోభానికి దూరంగా ఉండాలి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
తుల : ఆర్థిక వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, పట్టింపులు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త. 
 
వృశ్చికం : ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. కుటుంబీకుల కోసం ఎంత పాటుపడినా పెదవి విరుపులు, ఈసడింపులు తప్పవు. సమాచార లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. 
 
ధనస్సు : విద్యార్థినుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించడం మంచిది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
మకరం : స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దైవ, కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. నూతన కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు. 
 
కుంభం : ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. వ్యవసాయ రంగాల వారికి చికాకులు తప్పవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. 
 
మీనం : ప్రముఖుల కలయికవల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం వంటివి తప్పదు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడొచ్చు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు