14-03-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివినా...

ఆదివారం, 14 మార్చి 2021 (04:00 IST)
మేషం : శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మిత్రుల కలయిక అనుకూలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం శ్రేయస్కరం కాదు. కష్టసమయంలో బంధువులు అండగా నిలుస్తారు. విందు, వినోదాలలో పరిమితి పాటించండి.
 
వృషభం : వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పనిలో అంచనాలు తారుమారు కావొచ్చు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. 
 
మిథునం : స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు. వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. 
 
కర్కాటకం : మీ సమర్థతపై భాగస్వామికులకు నమ్మకం కలుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం గ్రహిస్తారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసివస్తుంది. 
 
సింహం : పెద్దమొత్తం ధనం, విలువైన వస్తువులతో ప్రయాణం క్షేమం కాదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనిభారం పెరుగుతుంది. విద్యుత్, ఎలక్ట్రానిక్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
కన్య : దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు, దానధర్మాలకు ఖర్చులు చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
తుల : పెద్ద హోదాలో ఉన్నవారికి అధికార పర్యటనలు అధికమవుతాయి. పరిశోధనాత్మక విషయాలో ఆసక్తి చూపుతుంది. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. మితిమీరిన ఆలోచనుల మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. సమయానికి సహకరించని బంధు మిత్రుల తీరు ఆందోళన కరలిగిస్తుంది. 
 
వృశ్చికం : మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచండి. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. సోదరీ, సోదరులు మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 
 
ధనస్సు : బంగారు, వెండి ఆభరణాల వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి లాభదాయకం. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. రావలసిన బకాయిలు వాయిదాపడతాయి. కిరాణా ఫ్యాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు. విద్యా రంగాల్లో వారికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. నూతన టెండర్లు ఆశించిన సంతృప్తినీయజాలవు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
కుంభం : వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించండ కష్టసాధ్యం. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక అవకాశం చేజారిపోవడంతో నిరుత్సాహం చెందుతారు. 
 
మీనం : వృత్తి వ్యాపారాల రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. రచయితలకు పత్రికా, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. ఆడిటర్లకు పని ఒత్తిడి, ఫ్లీడర్లకు నిరుత్సాహం తప్పదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు