15-10-2019- మంగళవారం ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.

మంగళవారం, 15 అక్టోబరు 2019 (09:30 IST)
మేషం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. 
 
వృషభం: దైవ సేవాకార్యాక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మిధునం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులను కలుసు కుంటారు. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రహస్య విషయాలను తెలుసుకొంటారు. 
 
కర్కాటకం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. గృహములో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. 
 
సింహం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు కొత్త యత్నాలు మొదలెడతారు. మీ అభిరుచి, ఆశయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ చర్చలలో కొన్నిలోపాలు తలెత్తుట వలన మాటపడక తప్పక పోవచ్చు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.
 
కన్య: పారిశ్రామిక రంగాల వారికి అధికారులు, చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ఖర్చులు, రాబడి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.
 
తుల: ట్రాన్స్‌‌‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ చర్చలలో కొన్ని లోపాలు తలెత్తుట వలన మాటపడక తప్పకపోవచ్చు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి.  
 
వృశ్చికం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తవుతాయి. ధనం బాగా అందుట వలన ఏ కొంతయినా నిల్వచేయ గలుగుతారు. మీ సంతానం ఉన్నతికి మంచి పథకాలు రూపొందిస్తారు. క్రయ విక్రయ రంగాలలో వారికి అనుకూలం. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది. 
 
ధనస్సు: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టిసారిస్తారు.
 
మకరం: ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతల చేపట్టే అవకాశం ఉంది. మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సకారం అందిస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి. మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు నిర్విఘంగా పూర్తిచేస్తారు.
 
కుంభం: బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువలు అవసరం. సోదరుల మధ్య కలహాలు అధికం. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి కలిసిరాగలదు. స్థిరాస్థి విషయం గురించి ఆలోచిస్తారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటుంది.
 
మీనం: విద్యార్థులకు వసతి లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధిక మవుతాయి. స్పెక్యులేషన్ కలిసిరాదు. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు